RT75 | ధమాకా సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది టాలీవుడ్ క్రేజీ కాంబో రవితేజ (Raviteja), శ్రీలీల (Sreeleela). ఈ ఇద్దరి కలయికలో రవితేజ బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ రవితేజ 75 (RT75) వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా షురూ అయింది. కాగా చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తిక విషయాలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
తాజా టాక్ ప్రకారం ఆర్టీ 75 టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ దసరా సందర్భంగా ఉండబోతుందట. అంతేకాదు ఇందులో రవితేజ మరోసారి పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. లేటెస్ట్ వార్తల ప్రకారం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 40 శాతం పూర్తవగా.. నెక్ట్స్ షెడ్యూల్ అక్టోబర్ మొదటివారంలో షురూ కానుందని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్ మూడు వారాలపాటు కొనసాగనుందట. ఈ చిత్రంలో రవితేజ ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. 2025లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానున్నట్టు వార్తలు తెరపైకి వస్తుండగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పేరు లక్ష్మణ భేరి.. ఆదాయం చెప్పను తియ్.. ఖర్చు లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం అన్ లిమిటెడ్..అవమానం జీరో అంటూ ఇప్పటికే ఆర్టీ75లో రవితేజ పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు మేకర్స్.
రవితేజ ఖాకీ అవతార్‌లో కనిపించిన విక్రమార్కుడు, క్రాక్ సినిమాలు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయని తెలిసిందే. ఇప్పుడు మరోసారి పోలీసాఫీసర్‌గా కనిపించనుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
Hari Hara Veera Mallu | పవన్ కల్యాణ్‌ను అలా కలిశారో లేదో.. ఇలా హరిహరవీరమల్లు షూట్ షెడ్యూల్
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?