Hari Hara Veera Mallu | జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అభివృద్ది పనులతో బిజీగా మారిపోయారని తెలిసిందే. అయితే ఈ స్టార్ యాక్టర్ నిర్మాతలు, అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం సినిమాలకు కూడా కొంత సమయం కేటాయించేందుకు రెడీ అయ్యాడు. పవన్‌కల్యాణ్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu), సుజిత్ దర్శకత్వంలో ఓజీ (They Call Him OG), హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి.
తాజాగా హరిహరవీరమల్లు షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. మూవీ టీం పవన్ కల్యాణ్‌ను కలిసి సినిమా రీస్టార్ట్ విషయమై చర్చించింది. మన యుద్ద వీరుడు హరిహరవీరమల్లు ఎపిక్ యాక్షన్ సాగా షూటింగ్ సెప్టెంబర్ 23 నుంచి షురూ కానుంది. హాలీవుడ్ లెజెండరీ స్టంట్ డైరెక్టర్ నిక్ పవెల్ పర్యవేక్షణలో పవన్ కల్యాణ్ అండ్ టీంపై వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను మొదలుపెట్టబోతున్నారని సమాచారం. ఈ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. హరి హర వీరమల్లులో పాపులర్ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇలెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. వీటికి సంబంధించిన వార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
Our warrior outlaw’s epic action saga #HariHaraVeeraMallu shoot resumes on 23rd September with a massive action sequence under the stunt direction of Hollywood legend Nick Powell, with POWERSTAR 🌟 @PawanKalyan garu.💥⚔️@AMRathnamOfl @amjothikrishna @MegaSuryaProd @HHVMFilm pic.twitter.com/T8A8Sp11uv
— Mega Surya Production (@MegaSuryaProd) September 20, 2024
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్
Jani Master | గోవా నుంచి హైదరాబాద్‌కు జానీ మాస్టర్..
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?