మునుగోడు, మార్చి11 : మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001- 02 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు పాఠశాలపై ఉన్న మమకారంతో బుధవారం బీరువా అందజేశారు. అలాగే 2025 – 26 సంవత్సరంలో 10వ తరగతిలో పాఠశాలలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ.12 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.7 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.5 వేల నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేయడంతో పాటు 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కార్యక్రమానికి ఎంఈఓ తల్లమల్ల మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాము విద్యనభ్యసించిన పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బాల ప్రసాద్ గౌడ్, ఉపాధ్యాయులు కె.సత్తిరెడ్డి, రత్నయ్య, అన్నపురెడ్డి, వెంకటేశ్వర్లు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

జడ్పీహెచ్ఎస్ మునుగోడుకు పూర్వ విద్యార్థులు బీరువా అందజేత