ఎర్రుపాలెం, ఆగస్టు 03 : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల బీఆర్ఎస్ కమిటీ నాయకులు సోమవారం మన్నేపల్లి గ్రామంలోని ఆయన స్వగృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా ప్రతినిధిగా, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ ఇనపనూరి లాలయ్య, సీనియర్ మండల నాయకులు కుడుముల మల్లికార్జునరెడ్డి, శీలం నారాయణరెడ్డి, బొర్రా నరసింహారావు, యరమల కృష్ణారెడ్డి, కోట లోకేష్, గద్దల శ్రీనివాసరావు, తిరుపతిరావు, కాళేశ్వరరావు, కత్తి నాగేశ్వరరావు, కాలసాని వెంకటనారాయణ, కూరపాటి నాగేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.