న్యూఢిల్లీ: అయోధ్యలోని రామమందిర విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు సోమవారం కూడా నిరసన కొనసాగించారు. రామ మందిరం విరాళాల చోరీతో పాటు విద్యార్థి నిరసనకారులపై పోలీసుల బలప్రయోగంపై పార్లమెంట్ ప్రాంగణంలోని మకర ద్వారం ముందు నిరసన చేశారు. (Opposition MPs Protest) కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీకి చెందిన డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, టీఎంసీకి చెందిన మహువా మోయిత్రా, జేఎంఎంకు చెందిన మహువా మాఝీ, ఆర్ఎస్పీకి చెందిన ఎన్కే ప్రేమ్‌చంద్రన్ తదితర ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌కు ఎందుకు రావడం లేదు? అన్న పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించడంతోపాటు నినాదాలు చేశారు.
కాగా, రామమందిరంలో విరాళాల చోరీకి ప్రతీకగా విరాళాల పెట్టెలను పార్లమెంట్ ఆవరణలో ఉంచారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాటి చుట్టూ బారులు తీరారు. కొందరు ఎంపీలు విరాళాల పెట్టెలో నగదు కూడా వేశారు. ఆ తర్వాత విరాళాల ఆదాయం లెక్కింపు సందర్భంగా చోరీ చేయడాన్ని ప్రతీతాత్మకంగా ప్రదర్శించారు.
Opposition MPs hold protest in Parliament premises against Ram Temple donation row. pic.twitter.com/F2sD5VxVWT
— News Arena India (@NewsArenaIndia) August 3, 2026
#WATCH | Delhi | Monsoon Session of the Parliament | Opposition MPs, including Priyanka Gandhi Vadra and others, stage a protest over the issue of the alleged Ram Mandir donation embezzlement case. pic.twitter.com/KtHtQMV4qH
— ANI (@ANI) August 3, 2026
“प्रदर्शन में जमा हुए 47 हजार रु मंदिर में दिएजाएंगे”#दिल्ली : संसद परिसर में प्रदर्शन करते हु़ए अब तक जमा हुए 47,100 रुपए।
👉 सपा सांसदों ने कहा कि ये मंदिर में दिया जाएगा और रसीद ली जाएगी। #Parliament pic.twitter.com/IFramWyG6i— The Lucknow Times (@thelucknowtimes) August 3, 2026