Asian Games : ఆసియా క్రీడల్లో భారత ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సిక్సర్ల మోత మోగించాడు. పాకిస్థాన్ (Pakistan) తో జరిగిన ఫైనల్ మ్యాచ్ (Final Match) లో చెలరేగిపోయాడు. ఆట ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యంత వేగంగా 400 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు అతడు సృష్టించాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (Chris Gayle) ను కూడా అభిషేక్ వెనక్కి నెట్టాడు. అంతేగాక భారత్-పాక్ (IND-PAK) అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక సిక్సర్లు (Most Sixers) బాదిన ఆటగాడిగానూ నిలిచాడు.
పాకిస్థాన్‌తో ఆసియా క్రీడల స్వర్ణ పతక పోరులో అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. రెండో ఓవర్లోనే తొలి సిక్సర్ బాదిన అతడు.. ఆ తర్వాత అదేజోరు కొనసాగించాడు. వరుసగా భారీ షాట్లు ఆడుతూ పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో తన నాలుగో సిక్సర్ బాదిన వెంటనే టీ20ల్లో 400 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. ఇందుకు కేవలం 3,513 బంతులే తీసుకున్నాడు. గతంలో క్రిస్ గేల్ 3,557 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ 3,027 బంతులతో 400 సిక్సర్లు బాది తొలి స్థానంలో ఉన్నాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అభిషేక్ మొత్తం ఏడు సిక్సర్లు బాదాడు. దాంతో భారత్-పాక్ టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన యువరాజ్ సింగ్ రికార్డును సమంచేశాడు. 2012లో అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌పై యువరాజ్ ఏడు సిక్సర్లు బాదాడు. మరోవైపు పాక్‌పై టీ20ల్లో అభిషేక్ సిక్సర్ల సంఖ్య 14 కు చేరింది. ఈ రెండు జట్ల మధ్య అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (11) రికార్డును అధిగమించాడు. 2026లో టీ20ల్లో 100 సిక్సర్లు బాదేందుకు అభిషేక్ 651 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ (589 బంతులు) తర్వాత అభిషేక్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. డెవాల్డ్ బ్రెవిస్ (653 బంతులు) ను వెనక్కి నెట్టాడు.