Manne Krishank | మా దగ్గరున్న వివరాలన్నీ మీకు పోస్ట్ ద్వారా మీమీ కార్యాలయాలకు పంపిస్తం.. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి దమ్ముంటే రేవంత్ మెడికోవర్ అంశంపై విచారణ చేపట్టాలని బీఆర్ ఎస్ మన్నెక్రిశాంక్ సవాల్ విసిరారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెడికోవర్ ఆస్పత్రుల మీద, మ్యాక్స్పియన్ ఫార్మా మీద కార్పోరేట్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్న మైండ్ వాల్డ్ కన్స్ట్రక్చన్స్ మీద విచారణ చేపట్టండి.. అంటే రెండున్నరేళ్ళలో రేవంత్ రెడ్డి కుటుంబం వ్యాపారాలు పెరిగినయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చాక షోరూంలు, కారు షోరూంలు హెల్త్ ఆస్పత్రులు, స్కూల్స్ తో దండపాళ్యం బ్యాచ్ దోచుకుంటున్నది కాబట్టి… వాస్తవానికి ఇవాళ క్వశ్చన్ చేసేటప్పుడు అందరు అన్నరు.. ఇప్పటికే రెండు సార్లు జైలుకు పంపించిర్రు. మొన్న ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. చిన్నపాపను కూడా బెదిరించారు. రేవంత్ రెడ్డి చేయాల్సివన్నీ చేసేశాడు.. ఇంకేం చేస్తడు.. మా అంటే ఇక భౌతిక దాడో.. ఎన్కౌంటరో చేపిస్తడన్నారు.
మెడికోవర్ హాస్పిటల్స్, మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ కన్స్ట్రక్షన్స్, శోదా కన్స్ట్రక్షన్స్, స్వచ్ బయో, టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ స్కాంల మీద రేవంత్ రెడ్డి సోదరులు, కుటుంబసభ్యులు రూ.50 వేల కోట్ల స్కాంలు చేశారు. వీటి అన్ని ఆధారాలను కాపీలతో ఈడీకి, మల్లికార్జున ఖర్గేకు, ప్రధాని కార్యాలయానికి, రాష్ట్రపతి కార్యాలయానికి, ప్రతిపక్ష నాయకులకు అందరికీ పంపిస్తానన్నారు మన్నె క్రిశాంక్.
మెడికోవర్ హాస్పిటల్స్, మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ కన్స్ట్రక్షన్స్లో ఎందుకు దుంప శిరీష డైరెక్టర్గా ఉన్నారు..? నేను చెప్పినవి తప్పు అని నిరూపిస్తే మరోసారి ప్రెస్మీట్ పెట్టనని.. రేవంత్ రెడ్డి కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్తా.. వీటిపై విచారణకు రేవంత్ రెడ్డి సిద్ధమా? అని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డికి మన్నె క్రిశాంక్ ఛాలెంజ్
నేను చెప్పినవి తప్పు అని నిరూపిస్తే మరోసారి ప్రెస్మీట్ పెట్టను
రేవంత్ రెడ్డి కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్తాను
మెడికోవర్ హాస్పిటల్స్, మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ కన్స్ట్రక్షన్స్, శోదా కన్స్ట్రక్షన్స్, స్వచ్ బయో, టెసెరాక్ట్… https://t.co/quDxOQVk0p pic.twitter.com/dzJ5FpMUPM
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2026
బీజేపీకి దమ్ముంటే రేవంత్ రెడ్డి MEDICOVER అంశంపై విచారణ జరపాలి
రెండున్నరేళ్లలో రేవంత్ రెడ్డి కుటుంబం వ్యాపారాలు అడ్డగోలుగా పెరిగాయి
ఇవన్నీ బయటపెట్టినందుకు మళ్లీ జైలుకు పంపిస్తారో లేక ఈసారి ఎన్కౌంటర్ చేస్తారేమో
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ https://t.co/1ShBwoVVsM pic.twitter.com/0Wol96ulVh
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2026