ఇల్లెందు, అక్టోబర్ 03 : తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇల్లెందు పట్టణంలోని తెలంగాణ తల్లి సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. ఈ పథకం రాష్ట్ర చరిత్రలో ఒక సామాజిక విప్లవం వంటిదన్నారు. అధికారంలోకి రాగానే 2014 అక్టోబర్ 2న రూ.51,000 ఆర్థిక సాయంతో పథకం ప్రారంభించిన కేసీఆర్ ,2017లో రూ.75,116కు.. 2018లో రూ.1,00,116కు పెంచారని, తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో 13,15,297 మంది ఆడబిడ్డలకు రూ.11,560 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించి పేదింటి ఆడబిడ్డకు కేసీఆర్ మేనమామలా అండగా నిలిచారన్నారు. కళ్యాణ లక్ష్మీ ద్వారా ఒక పథకాన్ని మాత్రమే అమలు చేయలేదని బాల్య వివాహాల నిర్మూలనకు బలమైన పునాది వేశారని కొనియాడారు. అదే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసిందని మండిపడ్డారు. తులం బంగారం దేవుడెరుగు, కేసీఆర్ ఇచ్చిన లక్ష ఇస్తే చాలు అన్న పరిస్థితి వచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సుదర్శనం రంగనాథ్ మండల మాజీ అధ్యక్షుడు శీలం రమేశ్, పట్టణ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీర హౌసింగ్ నాయక్, కో ఆప్షన్ మాజీ మెంబర్ మండల నాయకులు ఘాజి, కాంతారావు, సుభాష్ నగర్, ఉప సర్పంచ్ కొల్లిపాక కవిత, సుదిమళ్ల వార్డు మెంబర్ ఊకె భద్రమ్మ, మామిడిగూడెం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఊకె ఎర్రమ్మ, మదర్ బి,భవాని, నారాయణమ్మ, నూర్జహాన్, సుదిమల్ల వార్డు మెంబర్లు ఇరుప శంకర్, కమలాకర్, హుస్సేన్, బి,మైరు, సలీమా, సుభాష్ నగర్ వార్డు మెంబర్ అశోక్, మదర్, బి,గవిస్య, మూకల సుక్కమ్మ, దాసరి ఉమా, మండల నాగమ్మ, కనగాల సుజాత, ఎస్ కే జాన్వి, ముఖ్య నాయకులు నారపాక వసంతరావు, రాచపల్లి శ్రీను, పరికపల్లి రవి గౌడ్, యువజన, సోషల్ మీడియా నాయకులు మూలగుండ్ల ఉపేందర్‌రావు, మునిగంటి శివ, లలిత్ కుమార్ పాసి, ఉద్యమకారుడు రామ్ లాల్ పాసి, సుదర్శన్, షేక్ అలీ, కల్తీ సారయ్య, ఎల్.రాంబాబు, జ్వాల సాంబ, కాసర్ల హరి, గోల్డ్ ఇమ్రాన్, ఎండీ అమీర్, గోపాలపురం మహేశ్, ఎస్కే కామ్రు పాల్గొన్నారు.