స్టేషన్ ఘన్పూర్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే డా. రాజయ్య ఫైర్ అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇవ్వడంపై ఆయన స్పందించారు. నిజంగా కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఉంటే మళ్లీ రాజీనామ చేసి గెలువాలన్నారు. అప్పుడు తనని ఎవరు ఎలాంటి మాటలు అనరన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రశ్నించాలని సవాల్ విసిరారు.
కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇచ్చారు. వారిద్దరూ పార్టీ మారినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు వారి అనర్హత వేటుపై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేశారు. వారిద్దరూ పార్టీ మారలేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తుది తీర్పు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందికి క్లీన్‌చీట్ వచ్చింది.