C Kalyan | కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master) డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే జానీమాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసుల బృందం జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకుని.. ఇవాళ ఉదయం హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ స్పందించారు.
సీ కల్యాణ్ ఈ అంశంపై ఓ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. జానీమాస్టర్ వివాదంలో కేసు నమోదైంది. ఇండస్ట్రీలో ఒక సమస్య పరిష్కారం చేసేటప్పుడు ఒకవేళ అన్యాయం జరిగితే తర్వాత పోలీసుల దగ్గరకెళ్లాలి. లేదంటే మొదటే పోలీసుల దగ్గరికెళ్లి ఉండొచ్చు. నిజంగా ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందా..? లేదా అనే దానిపై చాలా మంది వీటికి సంబంధం లేనోళ్లు కూడా ఎవరు నచ్చినట్టు వాళ్లు ఊహించుకుని రాసేస్తున్నారు. ఏది న్యాయం, ఏది అన్యాయనేది రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలుస్తుంది. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతుందనిపిస్తుందన్నారు.
ఇలా ఇండస్ట్రీకి చెడు జరుగుతుందేంటి అనే దానిపై నాలుగైదురోజుల నుంచి ఎంక్వైరీ చేస్తున్నా.. ఏంటిది ఏం జరిగిందని తెలుసుకుంటే. ఆ అమ్మాయిని రేపు చేశారంటారు.. పోక్సో కేసు పెట్టారంటారు. అసలు పోక్సో కేసు ఈ ఘటనకు ఎలా వర్తిస్తుందనేది నాకర్థం కాలేదని సీ కల్యాణ్ అన్నారు. ఆ అమ్మాయికి ఇప్పుడు 21 సంవత్సరాలు మేజర్. ఆ అమ్మాయి వచ్చి ఐదేళ్ల కింద నన్ను రేప్ చేశాడని ఇప్పుడొచ్చి కేసు పెడితే వర్తిస్తుందా..? దీన్ని పాలిటిక్స్‌లోకి తీసుకెళ్తూ.. మరోవైపు జిహాదీలంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో కులం లేదు. మాదంతా సినిమా కులం. ఈ విషయాన్ని రకరకాల విషయాల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు సీ కల్యాణ్.
Jani Master | గోవా నుంచి హైదరాబాద్‌కు జానీ మాస్టర్..
Maruti Nagar Subramanyam | నవ్వుల జాతరే.. మారుతి నగర్ సుబ్రమణ్యం ఓటీటీలోకి వచ్చేశాడు
Stree 2 | జవాన్ రికార్డ్ బ్రేక్.. హయ్యెస్ట్ గ్రాసర్‌గా శ్రద్దాకపూర్ స్త్రీ 2
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?