Stree 2 | బాలీవుడ్ యాక్టర్లు శ్రద్దా కపూర్ (Shraddha Kapoor), రాజ్ కుమార్ రావు నటించిన సీక్వెల్ ‘స్త్రీ 2’ (Stree 2). అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. స్త్రీ 2 ఇప్పటికే ఓపెనింగ్ డేన ఫైటర్, కల్కి 2898 ఏడీ (హిందీ) వసూళ్లను అధిగమించడంతోపాటు ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
హార్రర్ కామెడీ జోనర్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రెండో వారంలోనే రూ.400 కోట్ల క్లబ్‌లోకి ఎంటరై ఈ ఏడాది అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. తొలి రోజు నుంచే ఏదో రికార్డుతో వార్తల్లో నిలుస్తున్న స్త్రీ 2 (Stree 2) ఏకంగా ఇండియా బాక్సాఫీస్ వద్ద హయ్యెస్ గ్రాస్ సాధించిన హిందీ సినిమాగా నిలిచింది.
స్త్రీ 2 ఇప్పటివరకు రూ.586 కోట్లు వసూళ్లు రాబట్టి.. షారుక్ ఖాన్ జవాన్ పేరు మీదున్న (రూ.582 కోట్లు) రికార్డ్‌ను బీట్ చేసింది. హార్రర్ కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తు్న్నారో తాజా ఫిగర్ చెప్పకనే చెబుతోంది.. ట్రేడ్ అనలిస్టుల ప్రకారం జవాన్ 57 రోజుల్లో పై ఫిగర్‌ను చేరుకుంటే.. స్త్రీ 2 మాత్రం కేవలం 34 రోజుల్లో టాప్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలువడం విశేషం.
తక్కువ టైంలో స్త్రీ 2 రూ.600 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యే దిశగా ముందుకెళ్తూ.. కొత్తగా విడుదల కాబోయే స్టార్ యాక్టర్ల సినిమాలకు పెద్ద టాస్క్‌నే ముందుంచిందని తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు.
#Stree2 begins its momentous journey towards a new milestone: the prestigious ₹ 600 cr Club… With #NationalCinemaDay tomorrow [Friday], the film is expected to see a big boost in its #BO performance.
[Week 5] Fri 3.60 cr, Sat 5.55 cr, Sun 6.85 cr, Mon 3.17 cr, Tue 2.65 cr,… pic.twitter.com/gimgV85LhA
— taran adarsh (@taran_adarsh) September 19, 2024
Read Also :
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?
Kanguva | సూర్య కంగువ వచ్చేది అప్పుడే.. కొత్త విడుదల తేదీ ఇదే
RC 16 | టాలీవుడ్లో తొలిసారి.. రాంచరణ్ ఆర్సీ 16 టీంలోకి తంగలాన్ ఆర్టిస్ట్
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?