Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోబాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాబీ డియోల్ ఉధిరన్‌గా కనిపించబోతున్నాడు. కంగువ రెండు పార్టులుగా తెరకెక్కతుండగా.. కంగువ పార్టు 1 ముందుగా నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ 10న విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్.
అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ వెట్టైయాన్‌తో బాక్సాఫీస్ పోరు ఉండకూడదని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ప్రొడక్షన్ టీం నుంచి కొత్త విడుదల తేదీ ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కంగువ రిలీజ్ డేట్ నయా మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. టీం ముందు నుంచి కంగువ చిత్రాన్ని సోలోగా విడుదల చేయాలని భావిస్తోంది. అనుకున్నట్టుగానే మిడ్ నవంబర్‌లో ప్లాన్ చేసుకుంది.
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కంగువ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.
The Battle of Pride and Glory, for the World to Witness ⚔🔥#Kanguva‘s mighty reign storms screens from 14-11-2024 🤎#KanguvaFromNov14 🦅 @Suriya_offl @thedeol @directorsiva @DishPatani @ThisIsDSP @StudioGreen2 @GnanavelrajaKe @vetrivisuals @supremesundar @UV_Creations… pic.twitter.com/pkOsKnCCoZ
— UV Creations (@UV_Creations) September 19, 2024
Jani Master | జానీ మాస్టర్ కోసం గాలింపు.. బాధితురాలి ఇంటికి పోలీసులు..!
Jani Master | ఇది లవ్ జిహాద్ కేసు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?