Vetrimaaran | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసే అతికొద్ది దర్శకుల్లో ఒకరు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetri Maaran). ఈ లీడింగ్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే రికార్డుల గురించే అంతటా చర్చ నడుస్తుంది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుతలై పార్ట్-1 (తెలుగులో విడుదల పార్ట్ 1) ఏ రేంజ్లో పాపులారిటీ తెచ్చుకుందో తెలిసిందే. ఇప్పుడిక సీక్వెల్ ప్రాజెక్ట్ విడుతలై పార్ట్ 2 (Vidudhala Part 2) చిత్రీకరణను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
విజయ్ సేతుపతి (Vijay Sethupathi), సూరి లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న ఈ చిత్రంలో మంజు వారియర్ (Manju Warrier) కీ రోల్ పోషిస్తోంది. కాగా సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న సినీ జనాల కోసం ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం విడుదల పార్ట్ 2 కోసం డే అండ్ నైట్ షూట్ కొనసాగుతుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, కిశోర్ కాంబోలో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని ఇన్సైడ్ టాక్. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే డిసెంబర్ 20న విడుదల కానుంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద ధనుష్ నటిస్తోన్న కుబేరతో పోటీ పడటం ఖాయమైనట్టే. మొత్తానికి వెట్రిమారన్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా అవుట్‌పుట్ మాత్రం ఫస్ట్ పార్ట్‌ను మించిపోయేలా ప్లాన్ చేశాడట.
విడుదల పార్ట్ 1తో తమిళ్ కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. సూపర్ బ్రేక్ అందుకున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పెరుమాళ్ వాథియార్ పాత్రలో నటించగా… గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్‌గా కీలక పాత్రలో నటిస్తున్నాడు. సీక్వెల్లో కూడా విజయ్ సేతుపతి పాత్ర కొనసాగనుండగా.. మక్కల్ సెల్వన్‌కు జోడీగా మంజువారియర్ కనిపించబోతుంది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
#Vetrimaaran ‘a #ViduthalaiPart2 Update:
Currently Shooting happening Day/nit. Vijay sethupathi, Manju Warrier , Kishore portion are going.
December 20th Release. May be a chance to clash with DHANUSH ‘s #Kubera pic.twitter.com/TGMek9EgoU
— Chowdrey (@Chowdrey_) September 18, 2024
UI The Movie | మేకింగ్‌లో హిస్టరీ.. స్టన్నింగ్‌గా ఉపేంద్ర యూఐ లుక్
Jr NTR | మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం.. తారక్ కామెంట్స్ వైరల్