UI The Movie | తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడక్షన్ అవసరం లేని కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర (Upendra). ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో ‘యూఐ’ (UITheMovie) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన సౌండ్ ఆఫ్ యూఐ (Sound Of Ui) సినిమా ఎలాంటి థీమ్‌తో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఉపేంద్ర అశ్వంపై యుద్దవీరుడిలా కనిపిస్తున్న లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. నిబంధనలను నిర్వచిస్తూ ఓ వెలుగు వెలిగిన రియల్ స్టార్ ఉపేంద్రకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మేకింగ్‌లో హిస్టరీ. సినిమాను మరోసారి పునర్నిర్వచించేందుకు ఉపేంద్ర ఈ అక్టోబర్‌లో కీర్తి మార్గంలో రాబోతున్నాడంటూ ట్వీట్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయాలని గట్టిగానే ఫిక్సయినట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
బర్త్ డే సందర్భంగా సాయంత్రం 5:04 గంటలకు యూఐ మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు. ఈ చిత్రంలో రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రాన్ని ఉపేంద్ర టీం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. యూఐ అనౌన్స్మెంట్ వీడియో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ మూవీని లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్టైనర్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.
Wishing the man who’s been a ray of light breaking path defining norms – Real Star #Upendra a very Happy Birthday ❤️🔥
He’s blazing a path of glory set to redefine cinema once again this October 💥#HBDUpendra ❤️
– Team #UiTheMovie #UppiDirects #Upendra
@nimmaupendra pic.twitter.com/kMu3R5Ns7A— Sreekanth KP (@kp_sreekanth) September 18, 2024
నటుడిగా, డైరెక్టర్, నిర్మాత, స్క్రీన్ రైటర్, ప్లే బ్యాక్ సింగర్, లిరిసిస్ట్, పొలిటీషియన్‌గా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్న అతికొద్ది మంది స్టార్ యాక్టర్లలో ఒకడైన ఉపేంద్ర ఇండస్ట్రీలో చాలా మంది టాప్ సెలబ్రిటీలకు స్పూర్తి. ఉపేంద్ర గురించి సెలబ్రిటీల రియాక్షన్ పలు సందర్బాల్లో ఇలా..
Happy Birthday to MASTER OF DIRECTORS 🔥@nimmaupendra #Upendra #UiTheMovie #HBDUpendra #HappyBirthdayUpendra #UpendraReRelease. pic.twitter.com/vCFoL9zCWy
— 𝙍𝙎𝙆 (@RSKTheMonsters) September 18, 2024
Jani Master | పెద్ద హీరో ఆ అమ్మాయికి సినిమాలో అవకాశమిస్తామన్నారు.. జానీ మాస్టర్ వివాదంపై ఝాన్సీ