Jani Master | డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేయగా.. ఈ కేసు విచారణను నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారని తెలిసిందే. ముగ్గురు పోలీసులు తాజాగా డ్యాన్సర్ (బాధితురాలు)నుంచి స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. తాజాగా జానీ మాస్టర్ వివాదంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నటి, యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ అని.. ప్రభుత్వం తరపున మహిళా రక్షణ కోసం ఇండస్ట్రీలో సరైన మార్గదర్శకాలు లేవన్నారు. శ్రీరెడ్డి వివాదం తర్వాత ఒక కమిటీ ఏర్పాటైంది. జానీ మాస్టర్ విషయం గత రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉంది. బాధితురాలు మొదట ఈ అంశంలో వర్క్ పరంగా వేధింపులు అని చెప్పి.. ఆ తర్వాత లైంగిక వేధింపులు అని బయటపెట్టింది.
బాధితురాలితోపాటు జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం. లైంగిక వేధింపులనేది పని ప్రదేశంలో కాదు.. ఈ విషయంలో న్యాయపరంగా పోలీస్ కేసు పెట్టడం జరిగింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. 90 రోజుల్లోపే ఈ కేసుపై క్లారిటీ వస్తుంది. అమ్మాయిలు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆమె వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఉండాలి కూడా. ఈ కేసులో బాధితురాలి వివరాలు, ఫొటోలు కూడా ఎవరూ బయటపెట్టొద్దని ఝాన్సీ కోరింది. ఒక పెద్ద హీరో తన మేనేజర్‌తో ఫోన్ చేయించి ఆ అమ్మాయికి తన సినిమాలో అవకాశమిస్తామని హామీనిచ్చారని ఝాన్సీ పేర్కొన్నారు.
Dhanush | హీరోగా, డైరెక్టర్‌గా.. ఒకేసారి ధనుష్ డబుల్ ట్రీట్
Jani Master | క్యారవాన్‌లో నన్ను బలవంతం చేశాడు.. జానీ మాస్టర్‌పై బాధితురాలు స్టేట్మెంట్
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్