Jani Master | డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారని తెలిసిందే. ఈ కేసు విచారణను నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ముగ్గురు పోలీసులు తాజాగా కొరియోగ్రఫర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన విషయాలు బయట పెట్టింది.
బాధితురాలి ఇంట్లోనే నార్సింగి పోలీసులు 3 గంటల పాటు విచారించి ఆమె నుంచి వివరాలు సేకరించారు. జానీ మాస్టర్తనపై అత్యాచారం చేసి దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. షూటింగ్ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడు. సెక్స్ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడని..తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు పేర్కొంది.
ముంబైతోపాటు హైదరాబాద్‌లో కూడా తనపై లైంగిక దాడి చేశాడని. పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ నాపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్మెంట్లో పేర్కొంది. విచారణ అనంతరం బాధితురాలిని పోలీసులు భరోసారి కేంద్రానికి తీసుకెళ్లినట్టు సమాచారం.
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్
Vettaiyan | రజినీకాంత్ వెట్టైయాన్ ఆడియో లాంచ్ డేట్, ప్లేస్‌పై మేకర్స్ క్లారిటీ
Mathu Vadalara 3 | త్రిబుల్ ఎంటర్టైన్ మెంట్.. మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది