Vettaiyan | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి వెట్టైయాన్ (Vettaiyan). జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెట్టైయాన్ షూటింగ్ పూర్తయిందంటూ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ దిగిన స్టిల్ నెట్టింట వైరల్ చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ అందిస్తూ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది తలైవా టీం. తాజాగా ఆడియో లాంచ్ ఈవెంట్ వార్తను అందించారు మేకర్స్. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 20న గ్రాండ్‌గా వెట్టైయాన్ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఈవెంట్లో తలైవాతోపాటు చిత్రయూనిట్ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు. ఇటీవలే విడుదల చేసిన మనసిలాయో నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన వెట్టైయాన్ టైటిల్ టీజర్ నెట్టింట వైరల్ అవుతూ.. సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. రజినీకాంత్ మరోవైపు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కూలీ చిత్రంలో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
Mark your calendars! 🗓️ The VETTAIYAN 🕶️ Audio & Prevue event is happening on Sept 20 at 📍 Nehru Stadium, 6 PM onwards. Get set for a star-studded evening! 🤩#Vettaiyan 🕶️ Releasing on 10th October in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan… pic.twitter.com/42S3LQdNed
— Lyca Productions (@LycaProductions) September 16, 2024
Mathu Vadalara 3 | త్రిబుల్ ఎంటర్టైన్ మెంట్.. మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Journey Re release | శర్వానంద్, అంజలి జర్నీ రీరిలీజ్‌కు రెడీ.. డేట్ ఎప్పుడంటే..?