Chiranjeevi | శ్రీ సింహా (Sri Simha), సత్య కాంబినేషన్లో రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన సీక్వెల్ ప్రాజెక్ట్ మత్తు వదలరా 2 (Mathu Vadalara 2). క్రైం కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్లలో ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి తన స్పందన తెలియ జేశాడు.
నిన్ననే మత్తు వదలారా 2 చూశాను. ఇటీవల కాలంలో మొదటి నుంచి చివరి దాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనిపించలేదు. End Titles ను కూడా వదలకుండా చూశా. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ రితేశ్ రాణాకు ఇవ్వాలి. శ్రీసింహా, సత్య, ఫరియా అబ్దుల్లా అండ్ టీంకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు చిరంజీవి. ఈ ట్వీట్‌తో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెంచేస్తున్నాడు. ఇంకేంటి మరి టైం ఉంటే సినిమాపై మీరూ ఓ లుక్కేయండి.
మేకర్స్ లాంచ్ చేసిన టీజర్లో హి..హి..హి.. టీమా అంటే అన్నీ హిలు లేవు.. ఒకటే హి అంటూ ఫన్నీగా సాగుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గు లేదా.. అంటుంటే.. అయినా ఇది దొంగతనం కాదు.. తస్కరించుట అంటూ సత్య టైమింగ్‌తో సాగే డైలాగ్స్ సినిమా మెయిన్ హైలెట్‌గా నిలువడమే కాదు.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీ రోల్ పోషించాయంటున్నారు మూవీ లవర్స్.
ఇక భారీ నేరాలు. అధిక వాటాలు.. భారీ నవ్వులు అంటూ ప్రమోషనల్ పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి కాల భైరవ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
నిన్ననే ‘మత్తు వదలరా – 2’ చూసాను.
ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణా కి ఇవ్వాలి.
అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది
చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 15, 2024
.#MegaStarChiranjeevi @KChiruTweets Garu All Praises For #MathuVadalara2 pic.twitter.com/G9Y9t7jYzt
— BA Raju’s Team (@baraju_SuperHit) September 15, 2024
Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్.. పవన్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే.!