Bommarillu Re-Release | టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కెరీర్లో మర్చిపోలేని చిత్రాలలో బొమ్మరిల్లు ఒకటి. ఆయన సొంత బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందిన ఈ చిత్రంలో సిద్దార్థ్, జెనీలియా జంటగా నటించగా ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించాడు. 2006లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకుంది. భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిసింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్‌కు ‘బొమ్మరిల్లు’ ఇంటిపేరుగా మారింది. అయితే ఈ సినిమాను తాజాగా రీ రిలీజ్ చేయనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది.
ఈ సినిమాను సెప్టెంబర్ 21న రీ రిలీజ్ చేయబోతున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చింది. ఎప్పటికి మరచిపోలేని సినిమా.. ఆ ఆనందాన్ని పంచడానికి వచేస్తున్నాం కుదిరితే కప్ కాఫీ SEPTEMBER 21st మళ్ళి థియేటర్స్ లో అంటూ పోస్ట్ చేసింది.
ఇక హీరో సిద్ధార్థ్ విషయానికి వస్తే.. తెలుగులో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలతో తనకంటూ లవర్ బాయ్ ఇమేజ్ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్‌లు రావడం తమిళంలో సినిమాలు చేయడంతో తెలుగు ప్రేక్షకులు దూరం పెట్టారు.
A film that never fades… ❤️
ఆ ఆనందాన్ని పంచడానికి వచేస్తున్నాం 🤗
కుదిరితే కప్ కాఫీ SEPTEMBER 21st మళ్ళి థియేటర్స్ లో 💫 #Bommarillu #Bhaskar #Siddharth @geneliad @prakashraaj @ThisIsDSP @SVC_official pic.twitter.com/4lsohs0lPt
— Sri Venkateswara Creations (@SVC_official) September 14, 2024