హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా చోద్యం చూస్తున్న కాంగ్రెస్ సర్కార్.. యూనివర్సిటీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పాలక మండళ్లను సైతం ఏర్పాటు చేయకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ మినహా అన్ని యూనివర్సిటీల్లో పాలక మండళ్లు(ఈసీ) కాలపరిమితి ముగిసి రెండేైండ్లెనా.. రేవంత్ సర్కార్ వాటిని భర్తీ చేయడంలేదు. దీంతో వర్సిటీ అభివృద్ధి, పరిశోధనలు, పరిపాలన, నిధులు వినియోగం వంటి నిర్ణయాలపై ఆ ప్రభావం పడుతున్నది. పైగా వర్సిటీల ర్యాం కింగ్ కూడా పడిపోతున్నది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ అధికారు లు, వీసీలు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పటికీ సర్కార్ నిర్లక్ష్యం చేయడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు.
ఈసీ అనుమతి లేకుండానే జేఎన్టీయూలో ప్రమోషన్లు
జేఎన్టీయూలో కూడా పాలక మండలి ఏర్పాటు కాలేదు. దీంతో కొంతకాలంగా ఈసీ లేకుండానే వైస్ చాన్స్లర్ ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జేఎన్టీయూలో ఇటీవల 45 మంది ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇచ్చారు. అర్హతలు లేకపోయినప్పటికీ కొందరికి ప్రమోషన్లు ఇవ్వడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఎక్స్అఫీషియో ఆధ్వర్యంలో (విద్యాశాఖ సెక్రటరీ, ఇతర విద్యాశాఖ అధికారులతో సమావేశమైన కమిటీ) ప్రమోషన్లపై నిర్ణయం తీసుకోవడం సరికాదని సీనియ ర్లు పేర్కొంటున్నారు.
ఎక్స్అఫీషియో నిర్ణయం తాత్కాలికమేనని, పాలకమండలి ఏర్పాటైన తర్వాత ప్రమోషన్లపై మ రోసారి ఈసీ సమీక్షించాల్సి ఉంటుందని వెల్లడించారు. జేఎన్టీయూ ఇచ్చిన ప్రమోషన్లపై ఎవరైనా న్యాయస్థానాలకు వెళ్తే.. అవి తిరస్కరణకు గురవుతాయని విద్యావేత్తలు, నిపుణులు పేర్కొంటున్నారు. ఈసీ అనుమతి లేకుండా వీసీ తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత ఉండకపోవడంతో అభివృద్ధి పనులు, పాలనలో స్పష్టత కొరవడుతున్నదని వాపోతున్నారు. ప్రభు త్వం స్పందించి పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.