న్యూఢిల్లీ: భారత్‌లో ప్రతి ఏడాది సగటును సుమారు 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. చాలా బాధాకరమైన విషయమని, రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది ఇండియాలో 1.80 లక్షల మంది మరణిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదాలను తగ్గించే అంశంపై చర్యలు తీసుకోవాలని ఎంపీ సుధానమూర్తి ప్రశ్న వేశారు. అందమైన రో్డ్లు ఉన్నాయని, కానీ ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని, ఇది రోడ్ల వల్ల కాదు అని, డ్రైవర్లు సరిగా నడపలేకపోవడం వల్లే అని సుధామూర్తి అన్నారు.
జాతీయ రహదారులపై ప్రమాదాలను తగ్గించేందుకు ఆమె ఓ సూచన చేశారు. డ్రైవింగ్ లైసెన్సు ఇచ్చే ప్రక్రియ మరింత పటిష్టం చేయాలని సుధామూర్తి పేర్కొన్నారు. అయితే రోడ్డు ప్రమాదాల అంశంలో మనుషుల ప్రవర్తన చాలా ముఖ్యమైన అంశమని, డ్రైవింగ్ శిక్షణను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి గడ్కరీ తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద వసూల్ చేస్తున్న ఛార్జీల గురించి మాట్లాడుతూ.. ఫాస్టాగ్, యూపీఏ పేమెంట్ల గురించి వివరించారు. టోల్ ప్లాజాలను పూర్తిగా ఎత్తివేసి, స్మూత్‌గా ప్రయాణాలు సాగే రీతిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
మంచి సర్వీస్ కావాలంటే డబ్బులు చెల్లించాలని, అన్ని ఊచితంగా దొరకవు అని ఆయన తెలిపారు. టోల్ ప్లాజా నిబంధనలను ఆయన వివరిస్తూ.. ఫాస్టాగ్ లేని వారికి టోల్ ఫీజును నగదు రూపంలో చెల్లిస్తే రెండింతలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఒకవేళ హైవేలపై యూపీఐ ద్వారా టోల్ ఫీజు చెల్లిస్తే, 1.25 రెట్లు ఫీజును వసూల్ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మాజీ ఎంపీలకు టోల్ పాసులను జారీ చేయాలని రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ కోరారు.
VIDEO | “It is very painful. We record nearly 1.80 lakh deaths in road accidents every year,” says Union Minister Nitin Gadkari in the Rajya Sabha.
(Source: Sansad TV)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/AMWUYQkiLN
— Press Trust of India (@PTI_News) August 5, 2026