Lady Doctor | రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి డిస్పెన్సరీలో మహిళా డాక్టర్ లేరు. దీంతో సింగరేణి కార్మిక కుటుంబాల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గతనెల జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన సింగరేణి యాజమాన్యం గోలేటి డిస్పెన్సరీకి మహిళా వైద్యురాలి (Lady Doctor)ని నియమించింది.
ప్రస్తుతం మహిళా డాక్టర్ వారానికి ఒక రోజు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించనున్నారు. కానీ కార్మికుల కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పర్మనెంట్ గా డాక్టర్ ను కొనసాగించాలని కోరారు. కార్మికుల కుటుంబాల సమస్యపై స్పందించి మహిళా డాక్టర్ను నియమించేందుకు కృషి చేసిన బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ (GM) రమేశ్, డిప్యూటీ సీఎంవో డాక్టర్ పాండురంగాచారిలకు ఏఐటీయూసీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
మహిళా డాక్టర్ను ఏఐటీయూసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి, జీఎం కమిటీ సభ్యులు మారం శ్రీనివాస్, డాక్టర్ స్టాలిన్ బాబు పాల్గొన్నారు.