హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) పరిధిలో సమగ్ర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,257.20 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టీకే శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం నిధులను వివిధ వనరుల ద్వా రా స మకూర్చనున్నారు. 50శాతం నిధులు విదేశీ రుణంగా సేకరిస్తున్నారు. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ఈ ప్రాజెక్ట్‌కు అప్పు ఇచ్చేందు కు సుముఖత వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వ అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద 25 శాతం నిధులు అందనున్నాయి. మిగిలిన 25శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. అయితే, గతంలో ఈ ప్రాజెక్ట్‌కు రూ.4,170 కోట్లతో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయం 5, 257.20 కోట్లకు పెంచారు. ఇప్పుడు నిధుల ల భ్యతపై స్పష్టత రావడంతో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది.