Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల టైంలో బిజీగా ఉన్న పవన్ ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చాడు. అయితే ఏపీ ఎన్నికలు అయిపోయి ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. పవన్ కూడా డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్నాడు. అయితే పవన్ డిప్యూటీ సీఎం తన సినిమాలను ఎప్పుడు కంప్లీట్ చేస్తాడా ఎప్పుడెప్పుడు చూద్దామా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇందుకోసం విజయవాడలోనే షూటింగ్ సెట్‌ని వేస్తున్నట్లు సమాచారం. ఈ నెలఖరు లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో పవన్‌కల్యాణ్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. రిపబ్లిక్ డే రోజున ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం ఉండగా.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు తక్కువ సమయం ఉండడంతో ఏప్రిల్ వరకు వెళుతుందని టాక్ నడుస్తోంది.
రూల్స్ రంజన్ (Rules Ranjan) దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Also Read..