అమరావతి : తిరుపతిలోని ఓ సినిమా థియేటర్లో కత్తిపోట్ల(Stabbing ) ఘటన కలకలం రేపుతుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడు శనివారం తన స్నేహితులతో కలిసి సినిమా చేసేందుకు థియేటర్(Theater ) కు వచ్చాడు. అదే సమయంలో సూళ్లూరుపేటకు చెందిన కార్తీక్, యువతి కావ్య కూడా థియేటర్‌కు వచ్చారు. కార్తీక్ అనే యువకుడు లోకేష్ తో వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచాడు. అనంతరం యువతి కావ్యతో కలిసి పారిపోయాడు.
ప్రేమ వ్యవహారమే కత్తిపోట్లకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. యువతే దాడికి పురిగొల్పి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఎంబీయూ విద్యార్థి లోకేష్‌ను రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.