Kurchi Madathapetti | సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం (Guntur kaaram) సినిమాలోని కుర్చీ మడతపెట్టి (Kurchi Madathapetti ) సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా అయితే హిట్ అవ్వలేదు కానీ పాట మాత్రం వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ముఖ్యంగా మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మొగించింది ఈ పాట. అయితే ఈ పాటకు తాజాగా కేరళ తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ డ్యాన్స్ చేశారు. కుర్చీ మడతపెట్టి మా. మా మడతపెట్టి అంటూ క్రేజీ స్టెప్స్ వేశారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కుర్చీ తాత సరదాకి ‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఈ డైలాగ్‌ను హుకప్ లైన్ గా తీసుకుని రామజోగయ్య శాస్త్రి గుంటూరు కారంలో ఏకంగా ఒక పాటనే రాశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీలీలా, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు.
Most Celebrated Song of the Year#KurchiMadathapetti 🔥🥵
Place: Govt Medical College, Tiruvandrum pic.twitter.com/3vRiYaE3Py
— Movies4u Official (@Movies4u_Officl) September 14, 2024
Also Read..