కొచ్చి: ఇరాన్‌కు చెందిన ఐఆర్ఐఎస్ లావన్ నౌకలోని సుమారు 183 మంది సెయిలర్లు(Iranian Sailors) కొచ్చిలో ఉన్న విషయం తెలిసిందే. భారత్‌కు వచ్చిన ఇరాన్ నౌక్.. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇక్కడే నిలిచిపోయింది. అయితే ఆ నౌకకు చెందిన సుమారు వంద మందికిపైగా సిబ్బంది కొచ్చి నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం రాత్రి వెళ్లిపోయినట్లు తెలిసింది. వీరితో పాటు వేర్వేరు కారణాల వల్ల భారత్‌లో చిక్కుకున్న సుమారు 30 మంది ఇరానీ పౌరులు కూడా ఆ ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. అయితే ఆ ప్రత్యేక విమానం నేరుగా అర్మేనియా వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇరానీ ప్రభుత్వమే ఆ విమానాన్ని ఏర్పాటు చేసింది. కొలంబో నుంచి శుక్రవారం రాత్రి ఆ విమానం కొచ్చి చేరుకున్నది. ఆ తర్వాత అక్కడ నుంచి అది అర్మేనియా బయలుదేరి వెళ్లింది. అయితే నౌకకు చెందిన మిగితా సిబ్బంది కొచ్చిలోనే ఉండనున్నారు. ఇరానీ నావికుల తరలింపు ప్రక్రియ చాలా రహస్యంగా సాగింది. పశ్చిమాసియా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని .. తరలింపు గురించి మీడియాకు కానీ, ప్రజలకు కానీ సమాచారం ఇవ్వలేదు. ఇరాన్‌కు చెందిన దేనా అనే మరో నౌకను శ్రీలంక జలాల్లో అమెరికా జలాంతర్గామి పేల్చి వేసిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యల వల్ల ఐఆర్ఐఎస్ లావన్‌ను కొచ్చిలో డాక్ చేశారు.