Devara | పాన్ ఇండియా ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్‌గా దేవర సందడి మొదలైంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రయూనిట్.
ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగాతో ‘దేవర’ టీమ్ చిట్‌చాట్ నిర్వహించింది. ఈ చిట్ చాట్‌లో నాకు సినిమా గురించి మొత్తం తెలియాలి అని సందీప్ అనడం.. తారక్ ఇది ఒక యాక్షన్ డ్రామా అనడం చూడవచ్చు. ఇక దేవర కోసం 35రోజులు అండర్ వాటర్ సీక్వెన్స్ చేసినట్లు ఎన్టీఆర్ చెప్పగా.. ‘దేవర’ అందరి కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. అయితే మూవీ రన్‌టైంపై సందీప్ అడుగగా.. తారక్ సందీప్‌ను అడుగుతూ.. యానిమల్ రన్ టైం అసలుది ఎంత అంటూ అడుగుతాడు. కాగా వీళ్ల ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరోవైపు ఎన్టీఆర్ తెలుగు యువ నటులు సిద్దు జొన్నలగడ్డతో పాటు విశ్వక్ సేన్లతో కలిసి మరో చిట్ చాట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
Words as wild as the storm….
Here’s the promo! 💥#Devara #DevaraOnSep27th pic.twitter.com/YHPNyCokDq— Devara (@DevaraMovie) September 14, 2024
Also Read..