KTR | ‘మూసీ నదికి పునరుజ్జీవం’పై నేడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్..!
KTR | మూసీ నదికి పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అక్రమాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి నిలదిస్తూనే ఉంది. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతూ రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు మండిపడ్డారు.
KTR : మూసీ నదికి పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అక్రమాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి నిలదిస్తూనే ఉంది. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతూ రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు మండిపడ్డారు. ‘మూసీ నదికి పునరుజ్జీవం’ పేరుతో జరుగుతున్న అక్రమాలపై ఇవాళ కూడా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది.
ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్లో ‘మూసీ నది ప్రక్షాళన’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేస్తున్న అన్యాయాలను కేటీఆర్ ఎండగట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరికీ నష్టం కలగకుండా, ఏ ఒక్క ఇల్లును కూలగొట్టకుండా మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి కోసం చేపట్టిన ప్రణాళికలను కూడా ఆయన వివరించనున్నట్లు సమాచారం. మూసీ బాధితులకు భరోసా కల్పిస్తూ.. వారికి ప్రభుత్వ దురాగతాల గురించి వివరంగా వెల్లడించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

