న్యూఢిల్లీ: శిశువు పుట్టకముందే గర్భంలో ఉండగానే..42 రకాల ప్రమాదకరమైన ‘ఫరెవర్ కెమికల్స్’ బారిన పడుతున్నారని తాజా అధ్యయనం కనుగొన్నది. అమెరికా, కెనడాల్లో గత అధ్యయనాల్లో వచ్చిన ఫలితం, తాజాగా పరిశోధకుల అధ్యయనం ఒకటేనని నిరూపితమైంది.
మొదటి ప్రసవంలో జన్మించే శిశువు 42 రకాల ‘ఫరెవర్ కెమికల్స్’కు గురవుతున్నాడని పరిశోధకులు లెక్కతేల్చారు. కృత్రిమ రసాయానాలు ‘పీఎఫ్ఏఎస్’ 1940 నుంచి వాడుకలోకి వచ్చాయి. నేడు మనం ఉపయోగించే నాన్‌స్టిక్ వంటపాత్రలు, వాటర్‌ఫ్రూఫ్ దుస్తులు, డెంటల్ ఫ్లాస్, ఫాస్ట్ ఫుడ్ రేపర్స్, మేకప్ ఉత్పత్తులు మొదలైన వాటిలో ఇవి ఉంటాయి.