Mathu Vadalara 3 | టాలీవుడ్లో క్రైం కామెడీ నేపథ్యంలో సందడి చేస్తోన్న ప్రాంఛైజీ చిత్రం మత్తు వదలరా (Mathu Vadalara). రితేశ్ రానా (డెబ్యూ) దర్శకత్వంలో శ్రీ సింహా (Sri Simha), సత్య కాంబోలో 2019లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా సీక్వెల్ మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాంచైజీలో మూడో పార్టు కూడా ఉండబోతుంది. ఇదే విషయాన్ని మత్తు వదలరా 2 సక్సెస్ మీట్లో చెప్పాడు రితేశ్ రానా. మత్తు వదలరా 3 తప్పకుండా ఉంటుంది. మత్తు వదలరా 3పై పనిచేయాల్సి ఉందని చెప్పాడు. తప్పకుండా ఉంటుంది. అంతేకాదు సీక్వెల్ ఎండ్ కార్డ్స్ లో కూడా క్లారిటీ ఇవ్వడంతో నెక్ట్స్ చాప్టర్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. మూడో పార్టు ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తాడనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది.
ఫస్ట్ పార్టులో నగేశ్ అగస్త్య, రెండో పార్టులో ఫరియా అబ్దుల్లా థర్డ్ లీడ్ రోల్లో కనిపించగా.. మరి మూడో పార్ట్‌లో ఎవరిని యాడ్ చేయబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సీక్వెల్‌కు కాల భైరవ మరోసారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. మరి త్రీక్వెల్‌ను ఏ బ్యానర్లో వస్తుందనేది చూడాలి.
#MathuVadalara3 compulsory vuntadi. Kaani eppuduntado teledu
– #RiteshRana at #MathuVadalara2 success meet
pic.twitter.com/w8VJERUISS— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) September 14, 2024
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్.. పవన్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే.!