Journey Re release | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్లు శర్వానంద్, అంజలి, జై, అనన్య. ఈ టాలెంటెడ్ యాక్టర్ల కాంబోలో తెరకెక్కిన తమిళ చిత్రం ఎంగేయుమ్ ఎప్పోదుమ్. ఎం శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో జర్నీ (Journey) టైటిల్‌తో విడుదలైంది. బస్ ప్రయాణం నేపథ్యంలో సాగే కథతో ప్రేమ, ఎమోషన్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
2011లో విడుదలైన ఈ చిత్రం మళ్లీ 13 ఏండ్ల తర్వాత రీరిలీజ్ సినిమాల జాబితాలో చేరిపోయింది. జర్నీ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు పలు ప్రధాన పట్టణాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా షురూ అయినట్టు సమాచారం. జర్నీ 4K వెర్షన్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో మూవీ లవర్స్ రెడీగా ఉండండి మరి.
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్.. పవన్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే.!