హైదరాబాద్ : ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ( Public Governance) -ప్రగతి ప్రణాళికను ( Progress Plan) నిర్వహిస్తుంది. అయిదు దశల్లో 99 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి నోడల్ శాఖ గా వ్యవహరిస్తున్న ప్రణాళిక శాఖ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది.
ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల( Village Meeting) నిర్వహణ ,ఏప్రిల్ 16న మండల స్థాయిలో , మే 2న నియోజకవర్గ స్థాయి , మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని ఆ శాఖ వెల్లడించింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపింది. 10 వివిధ థీమ్‌లతో శాఖల వారీగా 99 రోజుల కార్యక్రమం ఉంటుందని వివరించింది.
మొదటి థీమ్‌లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ , రెండవ థీమ్‌లో ఆరోగ్యం 3లో అరైవ్.. అలైవ్, 4లో సంక్షేమం , 5లో పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట, 6లో రైతు సంక్షేమం.. వ్యవసాయంపై కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
7లో విద్య, 8లో యువత.. క్రీడలు, 9లో మహిళలు , 10వ థీమ్‌లో పర్యావరణంపై సమావేశాలు జరుగుతాయని తెలిపారు. మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు , 99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలుంటాయని వివరించింది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను తయారు చేశామని వెల్లడించింది .