Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లీడ్ రోల్లో నటించిన చిత్రం లాల్ సలామ్ (Lal Salaam). ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది. లాల్ సలామ్‌లో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.
కాగా సినిమా థియేటర్లలోకి వచ్చి ఏడు నెలలు దాటిపోయినప్పటికీ ఇంకా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది డైలామా కొనసాగుతోంది. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత లాల్ సలామ్ డిజిటల్ డెబ్యూ ఇవ్వబోతుందన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం.
కాగా ఓటీటీ విడుదలపై ఐశ్వర్య రజినీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా చివరలో ముందుగా తీసివేయబడ్డ కొంత పుటేజీని డైరెక్టర్ కట్ వెర్షన్లో మళ్లీ జోడించాం. ఇది థ్రియాట్రికల్ వెర్షన్‌కు పూర్తిగా భిన్నంగా ఉండబోతుంది. పొడగించిన కట్ (అదనపు పుటేజీ) కూడా సినిమాలో రాసిన విధంగా ఉండాలనుకున్నాం. ఏఆర్ రెహమాన్ కూడా దీని కోసం రీస్కోర్ చేశారు. ఇందుకోసం ఆయన ఎలాంటి అదనపు పారితోషికం తీసుకోలేదని చెప్పుకొచ్చింది.
లాల్ సలామ్ ఓటీటీలోకి త్వరలోనే రాబోతుందని చెప్పిన ఐశ్వర్య.. ఇంతకీ ఏ తేదీ అనేది క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి థ్రియాట్రికల్ వెర్షన్‌తో నిరాశలో మునిగిపోయిన తలైవా అభిమానులకు కొత్త వెర్షన్ ఎలాంటి ఫీల్ అందిస్తుందో చూడాలి మరి. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ తెరకెక్కించగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Vettaiyan | రజినీకాంత్ వెట్టైయాన్ ఆడియో లాంచ్ డేట్, ప్లేస్‌పై మేకర్స్ క్లారిటీ
Mathu Vadalara 3 | త్రిబుల్ ఎంటర్టైన్ మెంట్.. మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి