– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తడక వెంకటేశ్వర్లు వినతి
భూదాన్ పోచంపల్లి, మార్చి 04 : చేనేత సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మార్కండేయ నగర్లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మున్సిపల్ చైర్మన్ శాలువాతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుగోడు, భువనగిరి, ఆలేరు, నల్లగొండ ప్రాంతాల్లో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారని తెలిపారు. చేనేత భరోసా ఇప్పించాలని, చేనేత సొసైటీలకు రుణమాఫీ చేయించాలని కోరారు. చేనేత సంఘాలను బలోపేతం చేస్తే కార్మికులకు ఉపాధి కలిగి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సామ మధుసూదన్ రెడ్డి, మర్రి నరసింహారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భారత లవ కుమార్, పోచంపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, నాయకులు తడక గౌరీ శంకర్, గంజి యుగంధర్, కూరపాటి బాబు, రుద్ర సూర్యప్రకాష్, జోగు శ్రీను, కొంగరి ప్రకాష్, మెరుగు శశికళ పాల్గొన్నారు.