Jasprit Bumrah : శ్రీలంక పర్యటనకు ముందే భారత జట్టు(Team India)కు గుడ్‌న్యూస్. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తిరిగి జట్టులోకి వచ్చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఈ యార్కర్ కింగ్ ఫిట్నెస్ పరీక్షలో పాసయ్యాడు. దాంతో, త్వరలో లంకతో జరుగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పొరుగుదేశమైన లంకకు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఆగస్టులో వెళ్లనుంది.
పని ఒత్తిడి కారణంగా తరచూ గాయపడుతున్న జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సమయంలో గాయపడిన బుమ్రా.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)లో కోలుకున్నాడు. ఫిట్నెస్ పరీక్షలో పాసైన అతడు శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్నాడని సమాచారం.
🚨 REPORTS 🚨
Jasprit Bumrah has cleared his fitness test at the BCCI Centre of Excellence ahead of India’s Test series against Sri Lanka. 🇮🇳
(Source: PTI)#Cricket #India #JaspritBumrah pic.twitter.com/AzPh1M9xL4
— Sportskeeda (@Sportskeeda) July 31, 2026
దాంతో, ఇప్పటికే స్క్వాడ్‌కి ఎంపికైన బుమ్రా సిరీస్‌లో ఆడడం దాదాపు ఖరారైన నేపథ్యంలో భారత జట్టుకు పేస్ బౌలింగ్ కష్టాలకు తెరపడనుంది. ఆగస్టులో శుభ్‌మన్ సారథ్యంలోని భారత జట్టు లంకు వెళ్లనుంది. అక్కడ ఆగస్టు 15 వ తేదీన గాలే స్టేడియంలో మొదటి టెస్టు.. ఆపై ఆగస్టు 23న కొలంబోలో రెండో టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో ఉన్న గిల్ సేన.. ఈ రెండు మ్యాచుల్లో గెలిచినా టాప్-2లోకి వచ్చే అవకాశాలు తక్కువే.
భారత టెస్టు స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవ్‌దత్ పడిక్కల్, సరాన్ష్ జైన్.
🚨 News 🚨#TeamIndia‘s squad for the 2⃣-match Test Series against Sri Lanka announced
Note: Washington Sundar was not available for selection for the first Test.
More Details ▶️ https://t.co/Vk0Xd8Axmq #SLvIND pic.twitter.com/NuCcKBohMj
— BCCI (@BCCI) July 28, 2026