మహబూబ్ నగర్ : జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ( Jurala Project ) కు ఎగువ నుంచి భారీగా వరద నీరు తరలివస్తుంది . ఎగువ నుంచి 1,46,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా అప్రమత్తమైన ఇంజినీరింగ్ అధికారులు 28 గేట్లను ఎత్తి దిగువకు 1,33,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతోంది.