Crazy Kalyanam | క్రేజీ కళ్యాణం: ‘సూపర్ మ్యాన్’ బాలరాజుగా తరుణ్ భాస్కర్ సందడి!
Tharun Bhascker | ఒకవైపు మెగాఫోన్ పట్టి సినిమాలు తెరకెక్కిస్తునే మరోవైపు వరుస సినిమాలు చేసుకుంటుపోతున్నాడు టాలీవుడ్ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్.
Tharun Bhascker | ఒకవైపు మెగాఫోన్ పట్టి సినిమాలు తెరకెక్కిస్తునే మరోవైపు వరుస సినిమాలు చేసుకుంటుపోతున్నాడు టాలీవుడ్ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’ (CrazyKalyanam) హోలీ పండుగను పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి చిత్ర బృందం ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా నుండి టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తూ, ఆయన పోషిస్తున్న ‘బాలరాజు’ పాత్రను పరిచయం చేశారు. ఈ పోస్టర్లో తరుణ్ భాస్కర్ ‘సూపర్ మ్యాన్’ గెటప్‌లో కనిపిస్తూ సందడి చేస్తుండగా, సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంత ఫన్నీగా మరియు ఎనర్జిటిక్‌గా ఉండబోతుందో క్లియర్ హింట్ ఇచ్చారు. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ మరియు డైలాగ్ డెలివరీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. యారో సినిమాస్ పతాకంపై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ క్రేజీ ఎంటర్టైనర్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటుడు నరేష్ వీకే, అఖిల్ రాజ్ ఉడ్డెమారి, చైతన్య రావు ఇతర ముఖ్య పాత్రల్లో మెరుస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ దూపాటి కెమెరా బాధ్యతలు, శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెళ్లి చుట్టూ తిరిగే ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తరుణ్ భాస్కర్ మేనరిజమ్స్ మరియు అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ తోడవడంతో ‘క్రేజీ కళ్యాణం’పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Team #CrazyKalyanam wishes everyone a colorful and joyous HAPPY HOLI 🥳
Meet ‘Balraju’ aka #TharunBhascker, bringing madness and magic from Crazy Kalyanam 😄
An @ArrowCinemas Production No. 2@ItsActorNaresh @anupamahere @IamChaitanyarao @Akhilrajuddemar #BadrappaGajula… pic.twitter.com/CBtWW6DUe4
— BA Raju’s Team (@baraju_SuperHit) March 4, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

