‘భద్రాచలం ఛాంబర్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలి’
భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలని, ఏకపక్ష నిర్ణయాలు సబబు కాదని, వ్యాపార వర్గాలు కలిసి ఉండాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన...
– ఏకపక్ష నిర్ణయాలు చెల్లవు
– రిజిస్టర్డ్ కమిటీలో అందరికీ హక్కులుంటాయి
– నిబంధనలు పాటించాల్సిందే
– వ్యాపార వర్గాలు ఆలోచించాలి
– బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్
భద్రాచలం, నవంబర్ 19 : భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలని, ఏకపక్ష నిర్ణయాలు సబబు కాదని, వ్యాపార వర్గాలు కలిసి ఉండాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నిర్వహణలో గత పదేళ్లుగా సందిగ్ధత నెలకొనడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇటీవల ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు పూనుకున్నప్పటి నుండి జరుగుతున్న పరిణామాలు ఒక వర్గానికి కొమ్ముకాస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉంటున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియ జరిగి, స్క్రూట్నీ ముగిసి, గుర్తులు కేటాయించే సమయంలో కొందరిని ఎన్నికల పోటీ నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో సంస్థల ఎన్నికలు చూసామని, ఇటువంటి చిత్రమైన నిర్ణయాలు ఎన్నడూ.ఎక్కడ లేవన్నారు.
రిజిస్టర్ కమిటీలో అందరికీ హక్కులు ఉంటాయని ఇది గమనించాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలోనే కొంత అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. రిజిస్టర్ బాడీ ఎన్నికలు నిర్వహించాలంటే..రెవిన్యూ అధికారులకు సమాచారం అందించాలని, అటువంటిదేమీ చేయకపోవడం ఎన్నికల కమిటీకి అవగాహన రాహిత్యమేనని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల నిబంధనలను అడుగడుగున తుంగలో తొక్కారని, తమవారిని అందలం ఎక్కించేందుకే కుట్రలు జరిగాయని వెల్లడించారు. వ్యాపార వర్గాలు విజ్ఞతతో ఆలోచించాలని, ఇటువంటి కుయుక్తులను తిప్పి కొట్టాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని రావులపల్లి రాంప్రసాద్ ఆకాంక్షించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘భద్రాచలం ఛాంబర్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలి’
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
MLA Raja Singh | ఆయన చెప్పింది నిజమే…తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తుంది : ఎమ్మెల్యే రాజాసింగ్
Yadagirigutta | యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

