VidaaMuyarchi | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం విదాముయార్చి (VidaaMuyarchi). ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ మూవీని ఓ వైపు దీపావళి కానుకగా రిలీజ్ చేస్తారని, మరోవైపు పొంగళ్ 2025 సీజన్లో వస్తుందని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు మేకర్స్. తాజాగా మూవీ లవర్స్, అజిత్ కుమార్ అభిమానుల్లో నెలకొన్న డైలామాకు యాక్షన్ కింగ్ అర్జున్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ ఈవెంట్లో అర్జున్ మాట్లాడుతూ.. నేను విదాముయార్చి క్లైమాక్స్ షూట్‌ను పూర్తి చేశాను. సినిమా మరో రెండు, మూడు నెలల్లో మీ ముందుకొస్తుంది.
డిసెంబర్లో విడుదల కానుందంటూ చెప్పాడు. అర్జున్ తాజా కామెంట్స్‌తో సినిమా విడుదలపై అభిమానుల్లో నెలకొన్న డైలమాకు చెక్ పడినట్టైంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లలో అజిత్ కుమార్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ.. నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో కోలీవుడ్ నటుడు ఆరవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా రోడ్డుపై నిలబడి ఉన్న స్టైలిష్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఇప్పటికే లాంచ్ చేసిన లుక్‌లో ఆరవ్ ఓ ట్రక్కులో నుంచి దిగుతుండటం చూడొచ్చు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు.
Arjun confirmed that #Ajithkumar‘s #VidaaMuyarchi is releasing on December 2024😲🔥
“I just completed the Climax fight👊. Movie will release in 2-3 months around December ✅”pic.twitter.com/BRNY7lStnJ— AmuthaBharathi (@CinemaWithAB) September 16, 2024
Game Changer | స్టైలిష్‌గా ఎస్ థమన్.. రాంచరణ్ గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్‌పై హింట్
Vettaiyan | రజినీకాంత్ వెట్టైయాన్ ఆడియో లాంచ్ డేట్, ప్లేస్‌పై మేకర్స్ క్లారిటీ
Mathu Vadalara 3 | త్రిబుల్ ఎంటర్టైన్ మెంట్.. మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది