కొత్వాల్‌గూడలో రాఘవ కన్స్ట్రషన్స్కు చెందిన అక్రమ క్రషర్ క్వారీల నిర్వహణపై బీఆర్ఎస్
నిజనిర్ధారణ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు క్వారీలను గురువారం పరిశీలించింది.
అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ‘రాఘవ’పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. క్వారీని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ బృందంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, క్రిశాంక్, కార్తిక్‌రెడ్డి ఉన్నారు. -మణికొండ