Dhanush | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ (Dhanush). ఈ టాలెంటెడ్ స్టార్ హీరో ఇటీవలే హీరో కమ్ డైరెక్టర్‌గా రాయన్‌తో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేస్తున్న కుబేరపై ఫోకస్ కూడా పెట్టాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ధనుష్ కొత్త సినిమాలకు సంబంధించిన వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ధనుష్ డైరెక్టర్ కమ్ హీరోగా మరో సినిమా అప్పుడే సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. DD4గా వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ సైలెంట్‌గా మొదలు పెట్టి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు ధనుష్. ఇడ్లీ కడాయ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆకాశ్ (డెబ్యూ) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ ఇప్పటికే 2 పాటలను కంపోజ్ చేయగా.. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కొనసాగుతున్నట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. తిరు సినిమా తర్వాత ధనుష్, నిత్యమీనన్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
మరోవైపు రాంజానా, అట్రాంగి రే తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు ధనుష్. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రానికి తేరే ఇష్క్ మే (Tere ishk mein) టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. ఈ ఏడాది చివరలో షూటింగ్ షురూ కానుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానున్నట్టు సమాచారం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
#DD4 tentatively titled as #IdliKadai 🍽️
Starring – Dhanush, ArunVijay, Ashokselvan, NithyaMenen, Sathyaraj & Rajkiran 🌟
– After NEEK, GVPrakash is once again collaborating with Director #Dhanush🎶
– GVP has already composed 2 songs & song shoot is currently happening now🎥
-… pic.twitter.com/8BZ1W0CYaK— AmuthaBharathi (@CinemaWithAB) September 16, 2024
Jani Master | క్యారవాన్‌లో నన్ను బలవంతం చేశాడు.. జానీ మాస్టర్‌పై బాధితురాలు స్టేట్మెంట్
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్
Vettaiyan | రజినీకాంత్ వెట్టైయాన్ ఆడియో లాంచ్ డేట్, ప్లేస్‌పై మేకర్స్ క్లారిటీ