Good Bad Ugly | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar) వరుస సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) ఒకటి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజాగా అధిక్ రవిచంద్రన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా ఎప్పుడు విడుదల కానుందో క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
వచ్చే ఏడాది (2025) సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అజిత్ కుమార్ టీం వినోదం వేరే లెవల్లో ఉండబోతున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమా యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని హింట్ ఇవ్వగా.. మరోవైపు అజిత్ కుమార్ ఖైదీ గెటప్‌లో స్టైలిష్‌గా చీర్ అప్ మూడ్‌లో బ్యాక్‌డ్రాప్‌లో గన్స్ రౌండప్ చేసిన సెకండ్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
అజిత్ మరోవైపు మగిజ్ తిరుమేని డైరెక్షన్లో విదాముయార్చి సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. సంజయ్ దత్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Team #GoodBadUgly wishes the young and exciting director @Adhikravi a very Happy Birthday ❤🔥
He will serve VERA LEVEL entertainment on big screens in Pongal 2025 🔥
#AjithKumar @MythriOfficial @suneeltollywood @AbinandhanR @ThisIsDSP @editorvijay… pic.twitter.com/Sjcb4EssCW— Mythri Movie Makers (@MythriOfficial) September 17, 2024
Dhanush | హీరోగా, డైరెక్టర్‌గా.. ఒకేసారి ధనుష్ డబుల్ ట్రీట్
Jani Master | క్యారవాన్‌లో నన్ను బలవంతం చేశాడు.. జానీ మాస్టర్‌పై బాధితురాలు స్టేట్మెంట్
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్