జెనీవా: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) శనివారం రాత్రి అత్యవసరంగా సమావేశం కానుంది.
ఇరాన్‌కు వ్యతిరేకంగా యూఎస్-ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడులు, ప్రస్తుతం టెహ్రాన్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించడంతో పాటు ఉద్రిక్తతల నివారణకు చేపట్టబోయే చర్యలపై 15 మంది సభ్యులు భారత కాలమానం ప్రకారం రాత్రి 2.30 గంటలకు సమావేశం అవుతారు.
మండలిని వెంటనే సమావేశపర్చాలన్న రష్యా, చైనా, ఫ్రాన్స్, బహ్రెయిన్, కొలంబియాల డిమాండ్ మేరకు జరిగే ఈ సమావేశానికి బ్రిటన్ అధ్యక్షత వహించనుంది. కాగా, ఇరాన్‌పై దాడులను ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియా గుటెరస్ ఇప్పటికే ఖండించారు.