Jr NTR | గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం దేవర (Devara). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో సందడి చేసింది తారక్ అండ్ టీం.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమకు చెన్నై స్టెపింగ్ స్టోన్లాంటిది. చెన్నైతో సంబంధం లేకుండా ఏ సినిమా ప్రమోషన్స్ కూడా ఉండదు. మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం. కానీ సినిమాల పరంగా మాత్రం కాదు. మనమంతా సినిమా అనే పదంతో కలిసి ఉంటామంటూ చెప్పుకొచ్చాడు తారక్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మేకర్స్ ఇప్పటికే దేవర నుంచి విడుదల చేసిన సాంగ్స్, ట్రైలర్‌తో అనిరుధ్ బీజీఎం లెవల్స్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లడం గ్యారంటీ అని చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నాలుగు కట్స్తోయూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్టు సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైరగా నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. అసలెవరు వాళ్లంతా.. కులం లేదు.. మతం లేదు.. భయమే లేదు.. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి..చాలా పెద్ద కథ సామి.. రక్తంతో సముద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. అంటూ సాగుతున్న దేవర ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
“Chennai has been an stepping stone for Telugu film industry. There is no promotion of a movie happening without Chennai🤝. We are divided by language but not films anymore. We are together with one word called as Cinema🎥♥️”
– #JrNTR | #Devara pic.twitter.com/TJcKgUtxNM— AmuthaBharathi (@CinemaWithAB) September 17, 2024
Jani Master | పెద్ద హీరో ఆ అమ్మాయికి సినిమాలో అవకాశమిస్తామన్నారు.. జానీ మాస్టర్ వివాదంపై ఝాన్సీ