న్యూఢిల్లీ: ఆయుధాల దిగుమతిపై స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ తాజాగా నివేదిక(SIPRI Report) రిలీజ్ చేసింది. ప్రపంచంలో ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉన్నట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. 2021 నుంచి 2025 వరకు అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 8.3 శాతం ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశంగా భారత్ నిలిచినట్లు సిప్రి పేర్కొన్నది. ఇక అత్యధిక సంఖ్యలో ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశాల్లో ఉక్రెయిన్ నిలిచింది. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ గత అయిదేళ్లలో 9.7 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు సిప్రి రిపోర్టులో వెల్లడించారు. ట్రెండ్స్ అని ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ 2025 టైటిల్‌తో సిప్రి తన రిపోర్టును రిలీజ్ చేసింది. కానీ గత రికార్డులతో పోలిస్తే భారత్‌లో ఆయుధాల దిగుమతి తగ్గినట్లు నివేదికలో పేర్కొన్నారు. 2016 నుంచి 2020, ఆ తర్వాత 2021 నుంచి 2025తో పోలిస్తే భారత్ ఆయుధాలు దిగుమతి చేస్తున్న సంఖ్య 4 శాతం పడిపోయినట్లు సిప్రి తన నివేదికలో చెప్పింది.
అయితే ఇటీవల ఆయుధాలను డిజైన్ చేసి, ఉత్పత్తి చేసే అంశంలో భారత్ తన సామర్ధ్యాన్ని పెంచుకున్నదని, దాని వల్లే దిగుమతి తగ్గినట్లు సిప్రి అభిప్రాయపడింది. ఓ ప్రణాళిక ప్రకారం భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. ఫ్రాన్స్ నుంచి సుమారు 140 యుద్ధ విమానాలు, జర్మనీ నుంచి జలాంతర్గామిని తెప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. భారత్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న అగ్రదేశాల్లో రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ఉన్నాయి.
రష్యా నుంచి ఆయుధాలు దిగుమతి చేస్తున్న సంఖ్య తగ్గిపోయింది. 2011-15 మధ్య ఆయుధ దిగుమతి 70 శాతంగా ఉండేది. కానీ ఆ తర్వాత 2016 నుంచి 2020 వరకు దిగుమతి 51 శాతానికి పడిపోయింది, ఆ తర్వాత 2021 నుంచి 2025 వరకు 40 శాతానికి తగ్గినట్లు సిప్రి తన నివేదికలో చెప్పింది. ఇక 2021-25 మధ్య కాలంలో ఫ్రాన్స్ నుంచి 29 శాతం, ఇజ్రాయెల్ నుంచి 15 శాతం ఆయుధాలను దిగుమతి చేశారు. చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు రిపోర్టులో చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగుమల్లో పాకిస్థాన్ అయిదో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. ఆ దేశం సుమారుం 4.2 శాతం ఆయుధాలను దిగుమతి చేసింది. చైనా తన 80 శాతం ఆయుధాలను టర్కీకి సరఫరా చేస్తోంది. ఇక పాకిస్థాన్‌కు రెండో అతిపెద్ద సరఫరాదారుడిగా నెదర్లాండ్స్ కొనసాగుతున్నది. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాల్లో అమెరికా ఉన్నది. గ్లోబల్‌గా ఆ దేశం నుంచి 42 శాతం ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. మొత్తం 99 దేశాలకు అమెరికా ఆయుధాలను సరఫరా చేసింది.