Jani Master | డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master) పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదయ్యాయని తెలిసిందే. ఆ తర్వాత అతడిపై పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్ పోలీసుల బృందం ఫైనల్‌గా జానీమాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నార్సింగి పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇప్పటికే పోలీసులు బాధితురాలి ఇంట్లోనే విచారించి వివరాలు సేకరించారు. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసి దాడి చేశాడని.. షూటింగ్ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడని బాధితురాలు తన స్టేట్మెంట్లో పేర్కొంది.
సెక్స్ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడని..తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని, పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కాగా పని ప్రదేశాల్లో వేధింపులు ఉన్నాయంటూ బాధితురాలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ని ఆశ్రయించిందని తెలిసిందే.
ఈ ఘటనపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ అధ్యక్షురాలు ఝాన్సీ స్పందిస్తూ.. మా పరిధిలో మేం విచారణ పూర్తి చేశాం. ఇద్దరి వాదనలు విన్నాం. 90రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తాం. ఇలాంటి వ్యవహారాలపై పరిశ్రమకు చెందిన ఎవరు కైంప్లెంట్ చేసినా.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
Jani Master | జానీ మాస్టర్ కోసం గాలింపు.. బాధితురాలి ఇంటికి పోలీసులు..!
Jani Master | ఇది లవ్ జిహాద్ కేసు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?