Jani Master| డ్యాన్సర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల్లో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)పై నార్సింగి పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారని తెలిసిందే. కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాలి నుంచి ఇప్పటికే స్టేట్ మెంట్ తీసుకున్న పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) స్పందించింది.
జానీ మాస్టర్ కేసు వ్యవహారంపై కరాటే కళ్యాణి ఫైర్ అయింది. ఇది లవ్ జిహాద్ కేసు అన్న ఆమె లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల కేసులో తప్పు రుజువైతే జానీమాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేసింది. జానీమాస్టర్ మతం మారితే పెళ్లి చేసుకుంటాననడమేంటని ప్రశ్నించిన కరాటే కళ్యాణి.. బాధితురాలికి అందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
ఈ కేసులో తాజాగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరిన్ని ఆధారాలు సేకరించడంలో భాగంగా పోలీసులు ఇవాళ బాధితురాలి ఇంటికి మరోసారి వెళ్లనున్నారని తెలుస్తోంది.
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?
UI The Movie | మేకింగ్‌లో హిస్టరీ.. స్టన్నింగ్‌గా ఉపేంద్ర యూఐ లుక్
Jr NTR | మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం.. తారక్ కామెంట్స్ వైరల్