RC 16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) గేమ్ ఛేంజర్ (Game Changer)లో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ ఫినిషింగ్ టచ్‌లో ఉంది. కాగా ఈ మూవీ విడుదల కాకముందే ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో RC16లో నటిస్తున్నాడు. బ్లాక్ టీ షర్ట్ అండ్ షార్ట్‌లో యెల్లో గ్రీన్ షూ వేసుకున్న చరణ్ ఫిట్నెస్ కోచ్ శివోహంతో ఉన్న స్టిల్‌ను షేర్ చేస్తూ.. బీస్ట్ మోడ్ ఆన్.. ఆర్సీ 16 లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
తాజాగా ఆర్సీ 16 టీంతో తంగలాన్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏగన్ ఏకాంబరం (Aegan Ekambaram) జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు. నేను టాలీవుడ్లో పనిచేయడం ఇదే మొదటిసారి.. చాలా కాలంగా ఈ క్షణం కోసమే నేను ఎదురుచూస్తున్నా. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ బుచ్చి బాబు సానకు కృతజ్ఞతలు. రామ్ చరణ్‌తో కలిసి పని చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. తెలుగు సినిమాలో కొత్త అవకాశాలను అన్వేషించడానికి.. టాలీవుడ్ సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం.. అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఆర్సీ 16లో రాంచరణ్ ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఆర్సీ 16 చిత్రానికి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
Jani Master | జానీ మాస్టర్ కోసం గాలింపు.. బాధితురాలి ఇంటికి పోలీసులు..!
Jani Master | ఇది లవ్ జిహాద్ కేసు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?