Jani Master | డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్ పోలీసుల బృందం జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకుంది. తాజాగా జానీ మాస్టర్‌ను గోవా నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
ఇవాళ వేకువ జామున హైదరాబాద్‌కు తీసుకొచ్చిన నార్సింగి పోలీసులు.. జానీ మాస్టర్‌ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం జానీ మాస్టర్‌ను నేడు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నట్టు సమాచారం.
పని ప్రదేశాల్లో వేధింపులు ఉన్నాయంటూ బాధితురాలు ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ని ఆశ్రయించిందని తెలిసిందే. ఈ ఘటనపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ స్పందిస్తూ.. మా పరిధిలో మేం విచారణ పూర్తి చేశాం. ఇద్దరి వాదనలు విన్నాం. 90రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తాం. ఇలాంటి వ్యవహారాలపై పరిశ్రమకు చెందిన ఎవరు కైంప్లెంట్ చేసినా.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.
Maruti Nagar Subramanyam | నవ్వుల జాతరే.. మారుతి నగర్ సుబ్రమణ్యం ఓటీటీలోకి వచ్చేశాడు
Stree 2 | జవాన్ రికార్డ్ బ్రేక్.. హయ్యెస్ట్ గ్రాసర్‌గా శ్రద్దాకపూర్ స్త్రీ 2
Vettaiyan | రజినీకాంత్ స్టైల్ అదుర్స్.. వెట్టైయాన్ ఆడియో, Prevue లాంచ్ టైం ఫైనల్
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?